🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 24 October 2026, 8:32 pm Posted by : Telangana Vaartha

సూర్యాపేట: ఘోరం.. కోతులన్ని కరిచి బాలుడిని చంపేశాయి

News Image
కోతుల దాడిలో బాలుడు మృతి చెందిన విషాద ఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వల్లాపురంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన మొక్క వీరబాబు కుమారుడు మొక్క నిశాంక్ గౌడ్ (12) సాయంత్రం అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తుండగా కోతులు దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
🏠 Home