కోరుట్ల, అక్టోబర్ 23:-ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా నియామకం పొందిన సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ను, ఎంఐఎం మాజీ కౌన్సిలర్, మాజీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ సాబెర్ అలీ, కరీంనగర్ దారుస్సలాంలో ఆత్మీయంగా సన్మానించారు. ఈసందర్భంగా సాబెర్ అలీ మాట్లాడుతూ..గులాం అహ్మద్ హుస్సేన్ కు, జగిత్యాల జిల్లా బాధ్యతలు కూడా అప్పగించాలని, ఎంఐఎం అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసీ కి విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ నగర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎంఐఎం పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు గులాం అహ్మద్ అలుపెరుగకుండా అహర్నిశలు కృషి చేశారని చెప్పారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మైనారిటీ ప్రజల సమస్యలను పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకేళ్తూ, వాటి పరిష్కారానికి అనునిత్యం, రాత్రి పగలు తేడా లేకుండా సేవలు అందించారని చెప్పారు. యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించడం, మైనారిటీ వర్గాల సంక్షేమానికి పాటుపడటం, అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు కొససాగించడం అయన ప్రత్యేకతలని అన్నారు. ప్రజలతో సన్నిహితంగా ఉంటూ, ముస్లిం సమాజ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్న గులాం అహ్మద్ కు, అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రమోషన్ ఇచ్చి మూడు జిల్లాల అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం సంతోషకరమని పేర్కొన్నారు. గులాం అహ్మద్ భవిష్యత్తులో అయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోపాంచాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో ఎంఐఎం నాయకులు జాకీర్ అలీ, మాజ్ మజహర్ సులేమాన్, చాంద్ పాషా, జహీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.