🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 23 October 2026, 8:41 pm Posted by : Telangana Vaartha

విజిలెన్స్ తనిఖీల్లో భారతి ఇండస్ట్రీస్ బాగోతం బట్టబయలు

News Image
సిద్దిపేట : రంగారెడ్డి జిల్లాలోని ఓ రైస్ మిల్లులో దాచి ఉంచిన పీడీఎస్ రైస్ మూలాలు సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం మోతె గ్రామ శివారులోని భారతి ఇండస్ట్రీస్ లో బట్టబయలైంది.

వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం, మంగళపల్లి గ్రామ పరిధిలోని న్యూ బన్సల్ రైస్ ఇండస్ట్రీస్‌ లో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్ ) బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచుతున్నట్లు పసిగట్టిన విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పీడీఎస్ రైస్ సీజ్ చేశారు. పీడీఎస్ రైస్ ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారని ఆరా తీసిన అధికారులు..

ఈ మేరకు గత రెండు రోజులుగా సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం మోతె గ్రామ శివారులోని భారతి ఇండస్ట్రీస్ నుంచి పీడీఎస్ రైస్ తతనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ప్రభుత్వం సదరు రైస్ మిల్లుకు సరఫరా చేసిన ధాన్యం తో పోలిస్తే సుమారు 4వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా సదరు రైస్ మిల్లులో సుమారు 50 కిలోల బరువున్న 677 బియ్యం బస్తాలు, 25 కిలోల బరువున్న 101 బియ్యం బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా, అక్కడికి వచ్చిన టాటా లారీలో 50 కిలోల బరువున్న 51 బియ్యం బస్తాలు ఉన్నట్లు గుర్తించినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్ సీఐ అజయ్ బాబు వెల్లడించారు.
🏠 Home