🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 23 October 2026, 8:35 pm Posted by : Telangana Vaartha

విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలి

News Image
వెనకబడ్డ సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలి.
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
విద్యార్థులు చదువులో రాణించేందుకు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు తప్పకుండా యూనిఫార్మ్స్ వేసుకొని పాఠశాలకు రావాలని సూచించారు. విద్యార్థులు పాఠశాలకు తక్కువగా రావడంతో తల్లిదండ్రులకి ఫోన్ చేసి విద్యార్థులు పాఠశాలకు వచ్చేలా అవగాహన కలిగించాలన్నారు. విద్యార్థులు దసరా సెలవులను ఎలా గడిపారో అడిగారు. సెలవులకు మందు ఇచ్చిన అసైన్మెంట్స్ ను పూర్తిచేసి ఉపాధ్యాయులకు ఇవ్వాలని సూచించారు. వెనుకబడ్డ సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. పాఠశాలలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల గురించి మాట్లాడారు. దాతల సహకారంతో నిర్మించిన స్టేజి షెడ్ ను పరిశీలించారు. పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని పరిశీలించి విద్యార్థుల సంఖ్య ఆధారంగా తగినన్ని మరుగుదొడ్ల నిర్మాణానికి సహకరిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ పర్యటనలో గద్వాల మండల విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్, గద్వాల తహసిల్దార్ హరికృష్ణ, పాఠశాల జిహెచ్ఎం రేణుకా దేవి, తదితరులున్నారు.
..................................................
జారీ చేయువారు: డీపీఆర్ఓ/ జోగులాంబ గద్వాల జిల్లా.
🏠 Home