🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 23 October 2026, 7:35 pm Posted by : Telangana Vaartha

పేదరికాన్ని అధిగమించి పీజీ మెడికల్‌లో రాణించిన డాక్టర్ రూత్ జాన్ పాల్

News Image
ఖమ్మం :- నగరంలోని రమణగుట్ట మురికివాడకు చెందిన కొయ్యల రూత్ జాన్ పాల్ పేదరికాన్ని అధిగమించి వైద్య విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన ఆమె ఎన్నో కష్టనష్టాలు, అవమానాలను ఎదుర్కొంటూ చదువే లక్ష్యంగా ముందుకు సాగారు. తల్లి దండ్రుల దగ్గర ఉంటూ హైస్కూల్, ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసిన అనంతరం వైద్య విద్యపై ఉన్న ఆసక్తితో ఖమ్మంకు చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ కేవీ కృష్ణారావు తదితరుల సహకారంతో హైదరాబాద్‌లో ఎంసెట్ కోచింగ్ తీసుకున్నారు. అనంతరం ఎంబీబీఎస్ పూర్తి చేసి, హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ విభాగంలో పీజీ వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేసి తన ప్రతిభను చాటుకున్నారు. పేదరికం తన లక్ష్యానికి అడ్డుకాదని నిరూపించిన డాక్టర్ రూత్ జాన్ పాల్‌ను పలువురు అభినందించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, నిరుపేద విద్యార్థులకు అండగా నిలిచి సమాజ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించడమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
🏠 Home