🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 22 October 2026, 7:46 pm Posted by : Telangana Vaartha

పెళ్లి ఖర్చుల కోసం ఓ ప్రేమజంట చైన్ స్నాచింగ్‌

News Image
ప్లాన్ వికటించి పోలీసులకు దొరికిపోయారు..!
హైదరాబాద్‌లో పోలీసులకు పట్టుబడిన ఆంధ్రా ప్రేమ జంట..!
* ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా వెల్దుర్తికి చెందిన రమణారెడ్డి, వరలక్ష్మి..! వీరు హైదరాబాద్‌లోని గుర్రంగూడలో సహజీవనం చేస్తున్నారు..!
* తాము ప్రేమ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి ఖర్చులకు డబ్బు లేకపోవడంతో..అక్టోబర్ 18న హస్తినాపురంలోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో పూజలు చేస్తున్న 66 ఏళ్ల వృద్ధురాలు అందుగుల రాములమ్మ మెడలోని 30 గ్రాముల (రెండు తులాల) బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లారు..!
* సీసీటీవీ పుటేజీల ఆధారంగా దర్యాప్తు చేసిన వనస్థలిపురం పోలీసులు.. నిందితులను గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు..!
* వారి నుంచి బంగారు పుస్తెలతాడుతో పాటు రెండు మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు..!
🏠 Home