అణగారిన వర్గాల ఆశాజ్యోతి పండుగ సాయన్న.
దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా సాయన్న పోరాటం.
జయంతి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్.
గద్వాల:- భూస్వాముల దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసి, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా పండుగ సాయన్న నిలిచారని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. గురువారం తెలంగాణ పోరాట యోధుడు పండుగ సాయన్న జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐడిఓసి ఆవరణలో అధికారికంగా కార్యక్రమం నిర్వహించారు. పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, తెలుగు ముదిరాజ్ సంఘం నేతలు సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతిధులు మాట్లాడుతూ బుర్రకథలు, జానపద పాటల ద్వారా పలువురు కళాకారులు సాయన్న జీవితాన్ని వెలుగులోకి తీసుకొచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇలాంటి వీరుల జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం గర్వకారణమన్నారు. సాయన్న లాంటి మహనీయుల జీవిత కథలు ఆదర్శంగా నిలుస్తాయని, బహుజనులకు న్యాయం జరిగేందుకు చేసిన వీరి పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, గద్వాల మున్సిపల్ చైర్ పర్సన్ జయలక్ష్మి, పలువురు కౌన్సిలర్లు, తెలుగు ముదిరాజ్ సంఘం నేతలు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.