సూర్యాపేట టౌన్ జనసేన నూతన కోఆర్డినేటర్ల నియామకం
* సూర్యాపేట టౌన్ జనసేన నూతన కోఆర్డినేటర్ల నియామకం
* ఎమ్మెల్సీ ఎన్నికల్లో గడల శ్రీనివాస్ విజయమే లక్ష్యంగా కార్యాచరణ
* టౌన్ కోఆర్డినేటర్లుగా బాధ్యతలు స్వీకరించిన షేక్ యాకుబ్ పాషా, ఖమ్మంపాటి స్వరూప్, దండు మధు, బీమనపల్లి ఆకాష్
ఉమ్మడి ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి గడల శ్రీనివాస్ గెలుపే ధ్యేయంగా సూర్యాపేటలో పార్టీ కార్యకలాపాలు వేగవంతమయ్యాయి. సూర్యాపేట నియోజకవర్గ కోఆర్డినేటర్లు ఎడమ రాజేష్, పోనూరు శిరీష పర్యవేక్షణలో, నియోజకవర్గ పీఓసీలు రామగిరి శివసాయి, ఏ.వి. రావు ఆధ్వర్యంలో సూర్యాపేట టౌన్ కోఆర్డినేటర్ల బాధ్యతల స్వీకార కార్యక్రమం జరిగింది. టౌన్ కోఆర్డినేటర్లుగా షేక్ యాకుబ్ పాషా, ఖమ్మంపాటి స్వరూప్, దండు మధు, బీమనపల్లి ఆకాష్‌లు నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నియమితులైన వారికి నాయకులు అభినందనలు తెలియజేశారు. జనసేన సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, వార్డు స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని నాయకులు దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గడల శ్రీనివాస్ ని భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతీ ఒక్కరూ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూ, పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తామని నూతన కోఆర్డినేటర్లు స్పష్టం చేశారు.