🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 21 October 2026, 10:50 pm Posted by : Telangana Vaartha

శ్రీకాంత్‌ గౌడ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

News Image
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ నలమాస శ్రీకాంత్‌ గౌడ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.
టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కుందూరు దేవేందర్ రెడ్డి.
సూర్యాపేట ను కరువు జిల్లాగా ప్రకటించాలి.
సూర్యాపేట: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల శాసన మండలి అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ ను తొలిసారిగా బరిలో నిలుపుతున్నామని పట్టబద్రులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సూర్యాపేట జిల్లా తెలంగాణ రక్షణ సేన పార్టీ జిల్లా అధ్యక్షులు కుందూరు దేవేందర్ రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలోని ఎస్వికే గ్రాండ్ హోటల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు కవిత ఆదేశాల మేరకు పాంచ జన్య అంశాలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కరువు జిల్లాగా సూర్యాపేట జిల్లా ను ప్రకటించి ఎండిపోయిన పంటలకు ఎకరానికి 50, వేల రూపాయలు నష్టపరిహారం అందించి, విద్యుత్ కోతలను నివారించి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ పార్టీ ఉచిత విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ను ఇస్తుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి పార్టీ శ్రేణులు అహర్నిశలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఉమారాణి, కోదాడ నియోజకవర్గ ఇంచార్జీ సంజయ్ నాయక్, జిల్లా నాయకులు దండ శేఖర్ రెడ్డి, కారింగుల శ్రీనివాస్ గౌడ్, సుంకర లింగారెడ్డి, సైదిరెడ్డి, నాగమణి, ఉప్పలాచారి, ధరావత్ కృష్ణ నాయక్, యూత్ విభాగం జిల్లా అధ్యక్షులు సాయి చందు గౌడ్, యల్లేశ్వరరావు, ఉపేందర్ ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home