జోగులాంబ గద్వాల 19 అక్టోబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల పట్టణ కేంద్రంలోని సౌమ్యా చిల్డ్రన్స్ ఆసుపత్రిలో గత మూడు నెలల క్రితం వైద్యం వికటించి మూడు నెలల చిన్నారి మృతి చెందిన సంఘటనపై ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి నివేదికను పంపినట్లు వెల్లడించారు. మృతి చెందిన సంఘటనపై ఎటువంటి వివరాలు వెల్లడించకపోవడం తో ప లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం మూలంగా నిండు ప్రాణం బలైపోయిన ఆ కుటుంబం ఉన్న డబ్బులన్నీ ఆసుపత్రిపాలై దిక్కు తోచని పరిస్థితుల్లో బిడ్డను కోల్పోయి నేటికీ ఆ కుటుంబం అల్లాడుతూనే ఉంది. వైద్యులు కప్పిపుచ్చుకోవడానికి పలు పన్నాగాలు పని సమాప్తం చేసినట్లు కనబడుతుంది. సౌమ్య చిల్డ్రన్స్ ఆసుపత్రి.వైద్యుల నిర్లక్ష్యం మూలంగా చిన్నారికి. సకాలానికి వైద్యం అందక ఆక్సిజన్ అందకపోవడం వలన పాపం మృతి చెందిన సంఘటన ఉన్నట్లు అధికారులు పళ్ళు అనుమానాలు వ్యక్తపరిచారు. చివరికి చూస్తే అధికారులు పట్టించుకోకపోవడంతో. సౌమ్య ఆసుపత్రి లో చికిత్సలు కొనసాగుతున్న కన్నెత్తి కూడా చూడకపోవడం గర్వకారణం అన్ని చెప్పవచ్చు. నేడు సౌమ్య చిల్డ్రన్ ఆసుపత్రి గద్వాల్ పట్టణంలో రాత్రి పగలు వైద్య సేవలు కొనసాగుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి నిరక్షరాసులైన తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొని వచ్చి సౌమ్య చిల్డ్రన్ ఆసుపత్రు లో వైద్య సేవలు తీసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలు ఆర్ఎంపీల సహాయంతో ఇక్కడికి రావడం జరుగుతున్నట్లు తెలుస్తుంది. డబ్బుల కోసం రాత్రి పగలు సేవలు చేసే వైద్యులు పట్ల ప్రభుత్వం ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది. వైద్యుల నిర్లక్ష్య మూలంగా అనేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటూ జేబులు ఖాళీ చేసుకుని అప్పుల్లో కూరుకుపోయి ఆస్తులను పోగొట్టుకొని దీనాతి పరిస్థితికి చేరే దుస్థితి కనబడుతుంది. అనారోగ్యాన్ని అడ్డంగా పెట్టుకుని సంపాదనే ద్వేయంగా పనిచేసే వైద్యులపై ప్రభుత్వ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది. ఆ కోణంలోనే సౌమ్య చిల్డ్రన్స్ ఆసుపత్రి నిర్వహణ కొనసాగుతుందని చెప్పవచ్చ. అన్యం పుణ్యం తెలియని అభాగ్యులను ఆసరా చేసుకుని ప్రతిదానికి ఒక లెక్క చొప్పున వసూలు చేసి వైద్య సేవలు చేయడం ప్రైవేటు ఆసుపత్రులకు అలవాటుగా మారింది. ఓపి చార్జీ. బెడ్ షీట్ చార్జెస్ మెడిసిన్. స్కానింగ్ లు. ఎక్స్‌ట్రాలు ఆక్సిజన్‌లో తదితర రకాలలో ముక్కు పిండి వసూలు చేయడం అలవాటుగా మారింది.
వైద్యుల నిర్లక్ష్యమూలంగా అమాయకులు బలి: గద్వాల పట్టణ కేంద్రంలో ప్రైవేటు వైద్యుల నిర్లక్ష్యమూలంగా అమాయకులు బలైపోతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడని విమర్శలు ఉన్నాయి. సంపాదనే ద్వేయంగా పనిచేసే వైద్యుల వలన పేద వర్గాల్లోని అనారోగ్యాలు ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు అనేకం. నేడు సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోవడం కోకొల్లు. గద్వాల జిల్లా కేంద్రంలోనూ ప్రవేటు ఆసుపత్రులు 26. ప్రైవేటు కి క్లినిక్ సెంటర్లు 32 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక స్కానింగ్ సెంటర్లు. ఎక్స్రాలు ఆయుర్వేదం క్లినిక్‌లు తదితర రంగాల్లోనూ వైద్య సేవలో కొనసాగుతున్నాయి. ఎటువంటి అర్హత లేకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆర్ఎంపీలు నమ్మి మోసపోవడం జరుగుతుంది. అక్రమ వసూల్లోకి అలవాటు పడిన ఆర్ఎంపీలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నతాధికారుల పైన ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లోని అనారోగ్యలు ఆర్ఎంపీలను నమ్మి పట్టణ కేంద్రాల్లోని గద్వాల ప్రైవేటు వైద్య సేవలకు చికిత్సలు అనంతరం సొమ్ము కాళీ అయ్యి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇదేమిటి అని ప్రశ్నించేవారు లేక రోగులు ఉన్న డబ్బులు పోగొట్టుకొని గప్. చెప్ అని ఇండ్లకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ వైద్య ఆస్పత్రుల్లో వసతులు సౌకర్యాలు లేక సకాలంలో వైద్యము అందక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లే ప్రైవేటు ఆసుపత్రి నిర్వహణ చేపట్టడం వలన ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు సరిగా చూడకపోవడం తమ ఆసుపత్రికి రప్పించుకునే ప్రయత్నాలు కొనసాగడం గర్వకారణం దీన్ని ఎవరు గమనించకపోవడం వలన ప్రైవేటు వైద్యం మూడు పూలు ఆరు కాయలు లాగా పరమలిస్తుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రభుత్వం స్పందించి ప్రైవేటు ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది.