ఖమ్మం : నగరంలోని రిక్కా బజార్ 25వ డివిజన్లో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు కన్యా పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు . తొమ్మిది మంది చిన్నారులను నవదుర్గలుగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు . చిన్నారులకు పాదపూజలు చేసి , హారతులు ఇచ్చి , గాజులు , చీరలు , పూలు సమర్పించారు . వారికి ఇష్టమైన నైవేద్యాలను తయారుచేసి ఆశీస్సులు పొందారు . హిందూ సంప్రదాయంలో కన్యా పూజకు విశిష్టమైన ప్రాముఖ్యత ఉందని , బాలికలను దుర్గాదేవి తొమ్మిది రూపాలకు ప్రతీకగా భావించి పూజించడం ఆనవాయితీ అని నిర్వాహకులు తెలిపారు . ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గోళ్ళ చంద్రకళ వెంకటేశ్వర్లు , కవిత , సరిత , రేణుక , భాగ్యలక్ష్మి , లత తదితరులు పాల్గొన్నారు .