దామన్న విగ్రహావిష్కరణకు జనసంద్రం
ఆత్మీయ నేత విగ్రహం ముందు కన్నీటిపర్యంతమైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి గారు..
విగ్రహ ఆవిష్కరణ లో పాల్గొన్న జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామరావు గారు
సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు స్వర్గీయ టైగర్ శ్రీ రాంరెడ్డి దామోదర్ రెడ్డి విగ్రహావిష్కరణ మహోత్సవం సూర్యాపేట పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రివర్యులు అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కార్యక్రమ ప్రాంగణం సందడిగా మారింది.
అంగరంగ వైభవంగా ఏర్పాట్లు...
స్వర్గీయ శ్రీ రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి గారు ఈ విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
విగ్రహ ఆవిష్కరణ లో పాల్గొన్న జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామరావు పాల్గొన్నారు. వేణారెడ్డి గారు దామన్నతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయన జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలిపేలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ మహోత్సవానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, దామోదర్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దామన్నతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పలువురు ఆయన సేవలను స్మరించుకున్నారు.
విగ్రహం ముందు కన్నీటిపర్యంతమైన వేణారెడ్డి గారు...
స్వర్గీయ శ్రీ రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి విగ్రహం ముందు కొప్పుల వేణారెడ్డి గారు భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యారు. తనకు అత్యంత ఆత్మీయుడైన నాయకుడి జ్ఞాపకాలను తలచుకుంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడికి వచ్చిన అభిమానులను సైతం భావోద్వేగానికి గురిచేసింది. దామన్నతో తనకున్న సాన్నిహిత్యం, అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
దామన్న మరణం తీరని లోటు....
స్వర్గీయ శ్రీ రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి మరణం సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల ప్రజలకు తీరని లోటని కొప్పుల వేణారెడ్డి గారు పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై, నియోజకవర్గాల అభివృద్ధి కోసం పనిచేసిన నాయకుడిగా దామన్నను అభిమానులు గుర్తుచేసుకుంటున్నారని తెలిపారు. ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మరువలేనిదని భావోద్వేగంతో పేర్కొన్నారు.
దామన్న విగ్రహావిష్కరణ మహోత్సవం ఆయన అభిమానులకు, అనుచరులకు ఒక భావోద్వేగభరితమైన సందర్భంగా నిలిచింది. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనడంతో కార్యక్రమం ఘనంగా ముగిసింది. స్వర్గీయ శ్రీ రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి జ్ఞాపకాలను స్మరించుకుంటూ అభిమానులు, కార్యకర్తలు ఆయనకు నివాళులర్పించారు.