🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 19 October 2026, 6:28 pm Posted by : Telangana Vaartha

గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

News Image
తెలంగాణ గీత పనివారల సంఘం ఘనంగా 70వ వార్షికోత్సవాలు
ధర్మభిక్షం భవన్‌ ఎదుట జెండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు రేగటి లింగయ్య
సూర్యాపేట: తెలంగాణ గీత పనివారల సంఘం వ్యవస్థాపకులు బొమ్మగాని ధర్మభిక్షం ఆశయాలతో ముందుకు సాగుతూ, గీత కార్మికుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో సంఘం ఆవిర్భవించి 69 సంవత్సరాలు పూర్తయి 70వ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ధర్మభిక్షం భవన్‌ ఎదుట జిల్లా అధ్యక్షుడు రేగటి లింగయ్య జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొమ్మగాని ధర్మ బిక్షం గీత కార్మికుల కష్టాలు చూసి గీతా పనివారల సంఘం 1957లో అక్టోబర్ 19న అప్పటి వరంగల్ జిల్లా గార్లలో మొదటి మహాసభ జరిపిన ఘనత అయినది అప్పటినుండి ఇప్పటివరకు గీత కార్మికుల కోసం పెన్షన్లు, ఎక్స్గ్రేషియా, సొసైటీలు ఏర్పాటు చేయటం, ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమిని కేటాయింప చేయించడం, ఇలా అనేక పోరాటాలు చేసి గీత కార్మికులు సాధించి పెట్టింది బొమ్మగాని ధర్మబిక్షమని ఆయన కొనియాడారు. భారతదేశ మొత్తం తిరిగి అనేక సొసైటీలు ఏర్పాటు చేసి గీత కార్మికుల సంక్షేమం కోసం పోరాడాడని అన్నారు. అలాంటి గొప్ప నాయకుడు పుట్టిన నెల సూర్యాపేట లో 70 వార్షికోత్సవo చేసుకోవటం అదృష్టంగా భావిస్తున్నామని ఆయన తెలియజేశారు. తాటి, ఈత చెట్లపై ఆధారపడి జీవిస్తున్న గీత కార్మికులకు చెట్ల హక్కులు, వృత్తి భద్రత కల్పించాలని, కల్లుగీత వృత్తిని ప్రోత్సహించేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని కోరారు. వృత్తి నిర్వహణలో ఎదురయ్యే ప్రమాదాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక పనిముట్లు, రక్షణ పరికరాలు అందించాలని, కార్మికుల పిల్లలకు విద్యా, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరారు. గీత కార్మికుల పెండింగ్‌లో ఉన్న ఎక్స్గ్రేషియా సమస్యలను పరిష్కరించి, వారి ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు దోరేపల్లి శంకర్, బండారు లక్ష్మయ్య, రేగటి సాంబయ్య, రెడీమల శ్రీనివాస్, అయితేగాని కామేష్, పెద్ది వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
🏠 Home