🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 19 October 2026, 5:58 pm Posted by : Telangana Vaartha

జిల్లా ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు

News Image
ముఖ్యమైన పాయింట్స్:ఎస్పీ కె.నరసింహ
- చెడు నశించి.. మంచి వర్ధిల్లాలి.. సమాజంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలి.
- దసరా పండుగ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ పూజ నిర్వహించిన ఎస్పీ
సూర్యాపేట, అక్టోబర్ 19:- జిల్లా ప్రజలందరికీ విజయదశమి, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, చెడు నశించి మంచి వర్ధిల్లాలని, సమాజంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ ఆకాంక్షించారు. దసరా పండుగను పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఆయుధ పూజ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని పోలీస్ ఆయుధాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ ఆయుధాలు, వాహనాలు కీలక పాత్ర కలిగివున్నాయి తెలిపారు. పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణలో ఆయుధాలు, వాహనాలు ఎంతో అవసరమని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతలను కాపాడటంలో ఇవి ముఖ్యమైన సాధనాలని పేర్కొన్నారు. విజయదశమి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, ప్రతి ఒక్కరూ చెడును విడనాడి మంచిని స్వాగతించాలని సూచించారు. జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, ప్రతి కుటుంబంలో ఆనందం, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ మరోసారి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంజు భార్గవి, డీఎస్పీలు ప్రసన్న కుమార్, రవి, ఇన్‌స్పెక్టర్లు రామారావు, రాజశేఖర్, వెంకటయ్య, మగ్దుమ్ అలీ, ప్రవీన్ కుమార్, జానయ్య, శివకుమార్, నారాయణరాజు, ఎస్‌ఐలు, ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home