అడ్డగూడూరు 19 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కంచరపల్లి గ్రామంలో దుర్గామాత సన్నిధి ఆధ్వర్యంలో సోమవారం రోజు నిర్వహించిన యాగం అమ్మవారి కృపతో అత్యంత వైభవంగా, విజయవంతంగా పూర్తయింది. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని,తమ వంతు సహకారాన్ని అందించిన కమిటీ సభ్యులకు మరియు భక్తులకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు.అమ్మవారి ఆశీస్సులు మన గ్రామం పై మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని దుర్గామాత కమిటీ సభ్యులు కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో అర్చకులు భవాని మాల సభ్యులు, గ్రామస్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.