🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 18 October 2026, 11:08 pm Posted by : Kadem Ravi

కంచనపల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ మహిళల సందడి

News Image
అడ్డగూడూరు 18 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కంచనపల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు మహిళలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఒక్క మహిళలు తిరక్క పువ్వులు తెచ్చి బతుకమ్మలు పేర్చి మహిళలు నూతన వస్త్రాలు ధరించి తెలంగాణ సంస్కృతి సంప్రదాయ ప్రకారం గ్రామంలోని బతుకమ్మలను ఒకచోట చేర్చి మధ్యలో బొడ్డెమ్మను పెట్టి డిజె సౌండ్ తో ఆటపాటల మధ్య ఆనందంగా బతుకమ్మ ఆటను కొనసాగించారు. మహిళలు చిన్నలు,పెద్దలు ఆనందంతో ఆడి పాడారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలందరూ గ్రామ ఆడబిడ్డలు అందరూ పాల్గొన్నారు.
🏠 Home