ఖమ్మం:- ఖమ్మం నగరం 56వ డివిజన్ విజయనగర్ కాలనీ శ్రీ షిరిడి సాయి బాబా మందిర ప్రాంగణంలో 8వ రోజు వెన్న ముద్దుల బతుకమ్మ వేడుకలను చూడ ముచ్చటగా జరుపుకున్నారు. మహిళలు, చిన్నారులు భక్తిశ్రద్ధలతో తెలంగాణ సాంప్రదాయాలతో ఉత్సాహంగా నిర్వహించారు. చప్పట్లు కోలాటాలతో బతుకమ్మల చుట్టూ తిరుగుతూ సందడిగా జరుపుకున్నారు అనంతరం ప్రసాద వితరణ, బతుకమ్మల నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మహిళలు, కాలనీ పెద్దలు పాల్గొన్నారు.