🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 18 October 2026, 12:55 am Posted by : Telangana Vaartha

వలసదారులకు జేఎస్‌పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం

News Image
ముఖ్యమైన పాయింట్స్:చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో సేవా స్ఫూర్తి.. 200 మంది వలసదారులకు అన్నదానం
ఖమ్మం : జస్టిస్ ఫర్ సోషల్ పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ (జేఎస్‌పీడబ్ల్యూ) ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ వలసదారులకు అన్నదానం నిర్వహించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేనేజర్ దాట్ల రవితేజ, దివ్య దంపతుల కుమార్తె హద్విత పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది వలసదారులకు అన్నదానం నిర్వహించారు. సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు పెదపాక రమేష్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నామా వినోద్ కుమార్, ఉపాధ్యక్షుడు వేముల సీతారామారావు, సంయుక్త కార్యదర్శి మహమ్మద్ అస్గర్, కోశాధికారి మామిళ్లపల్లి నాగయ్యతో పాటు ఈసీ మెంబర్స్ చెన్నబోయి లక్ష్మీనారాయణ, మురికిపూడి బాబురావు, పులిపాటి నరసింహారావు, బత్తుల గోపాలరావు, గడదాస్ అప్పారావు, ఎర్ర నాగరాజు రెడ్డి మరియు పలువురు సభ్యులు హాజరయ్యారు. ఈ సేవా కార్యక్రమంపై స్థానికులు, వలసదారులు హర్షం వ్యక్తం చేశారు.
🏠 Home