🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 17 October 2026, 10:40 pm Posted by : Kadem Ravi

కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి

News Image
ముఖ్యమైన పాయింట్స్:భువనగిరి టౌన్ ప్లకార్డులతో ఎన్.పి.ఆర్.డి నిరసన కార్యక్రమం
భువనగిరి 17 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- పేదలవి 13 కోట్లు ఓట్లను తొలగించిన కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్. పి.ఆర్.డి యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం భువనగిరి టౌన్ వినాయక చౌరస్తాలో డాక్టర్" బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లాకార్డులు పట్టుకొని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.పి.ఆర్.డి జిల్లా అధ్యక్షులు సుర్పంగా ప్రకాష్ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల కమిషన్ చేపడుతున్న ఓట్లు తొలగింపు చర్యల వల్ల పేదల అరులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని అరులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉందని అన్నారు పేదలు అణగారిన వర్గాలు వికలాంగులు సహా ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యానికి పునాది అయినా ఓటు హక్కును పరిరక్షించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ పారదర్శకంగా వివరించాలని అరులైన ఓటర్లు పేర్లు జాబితా నుంచి తొలగించకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ప్రజల ఓటు హక్కకు భంగం కలిగించే చర్యలను తక్షణమే నిలిపివేయాలని ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్.పి.ఆర్.డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్లపల్లి స్వామి, జిల్లా కోశాధికారి కొత్త లలిత, జిల్లా పండాల శ్రీహరి, టౌన్ నాయకులు టీ మధు, తాతా నగర్ వార్డు కార్యదర్శి వల్లాల రాధాకృష్ణ, వలిగొండ మండల కార్యదర్శి కందుల కృష్ణమూర్తి, ఎస్కే నశీనా బేగం, ఎస్కే రషీద్, తదితరులు, పాల్గొన్నారు.
🏠 Home