సూర్యాపేట జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు గా పెద్దిరెడ్డి గణేష్ ఏకగ్రీవ ఎన్నిక
అదేవిధంగా ఉపాధ్యక్షులుగా ధర్మూరి వెంకటేశ్వర్లు, పుప్పాల కృష్ణమూర్తి, ఎర్ర హరికిషన్, సంయుక్త కార్యదర్శులుగా గొడితాల వెంకటేశ్వర్లు, వేముల వెంకటేశ్వర్లు, సరికొండ నరసింహారాజు ప్రచార కార్యదర్శిగా పబ్బతి వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులుగా ముక్కామల జానకి రాములు, ఏబెల్ శశి, ఎన్.సీ.రోజా, పూసోజు పద్మ, పోతుగంటి వీరాచారి, జిల్లేపల్లి జానయ్య, కొర్రపిడత శ్రీనివాస్, లింగాల శ్రీనివాస్, కొండా లింగారావు, తదితరులను ఎన్నుకున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన సూర్యాపేట జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పెద్దిరెడ్డి గణేష్ మాట్లాడుతూ సాహిత్య సాంస్కృతిక రంగంలో కవులు రచయితలను ఒక తాటిపై నడిపి సూర్యాపేట సాహిత్యరంగాన్ని సుసంపన్నం చేస్తామని నూతన వర్తమాన కవులు రచయితలకు ప్రోత్సాహం ఇస్తూ వారి రచనలను వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామన్నారు. తెలుగు భాషను సుసంపన్నం చేసే దిశగా అనేక కార్యక్రమాలు తీసుకుంటామన్నారు. కవిత్వ కార్యశాలలతో పాటు, తెలుగు భాష విస్తృతికి ఉన్నతికి తెలుగు భాషా ఉపాధ్యాయులను కలిసి కృషి చేసేలా ప్రయత్నం చేస్తామని అన్నారు. పాఠశాలల్లో క్షేత్రస్థాయిలో విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన కవిత్వ, కథా పోటీలు నిర్వహించి ప్రోత్సహిస్తామని సూర్యాపేట జిల్లా రచయితల సంఘం ఆ బాధ్యతను తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన అనేకమంది కవులు రచయితలు సాహితీప్రియులు పాల్గొన్నారు.