పోలీసు ఉత్తమ సేవా పతకం అందుకున్న సూర్యాపేట జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు–2026 సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభా పురస్కారాల్లో సూర్యాపేట జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డికి పోలీసు ఉత్తమ సేవా పతకం లభించింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ సీవీ ఆనంద్ ఐపీఎస్ గారు డీజీపీ కార్యాలయంలో రవీందర్ రెడ్డికి పతకాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ శ్రీ కె. నరసింహ అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డిని అభినందించారు. పోలీసు శాఖలో సుదీర్ఘకాలంగా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజలకు విలువైన సేవలు అందించారని, విధి నిర్వహణలో చూపిన అంకితభావం, కృషి అభినందనీయమని కొనియాడారు.
సుదీర్ఘ పోలీసు సేవలకు గుర్తింపు..
అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి 1992 సంవత్సరంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పోలీసు శాఖలో నియామకమై, పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో తొలి పోస్టింగ్‌లో విధులు నిర్వహించారు. అనంతరం 2007లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఎస్‌ఐ, సీఐ హోదాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సేవలందించారు. 2017లో డీఎస్పీగా పదోన్నతి పొందిన అనంతరం సీఐడీ విభాగంలో విధులు నిర్వహించారు. 2021లో అదనపు ఎస్పీగా పదోన్నతి పొంది వికారాబాద్ జిల్లాలో అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ డీసీపీగా, నిజామాబాద్‌లో, సికింద్రాబాద్ రైల్వే విభాగంలోనూ వివిధ హోదాల్లో సేవలందించారు. పోలీసు శాఖలో మూడు దశాబ్దాలకు పైగా వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు అందించిన సేవలకు గుర్తింపుగా ఆయనకు పోలీసు ఉత్తమ సేవా పతకం లభించడం పట్ల సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ హర్షం వ్యక్తం చేసింది. పోలీసు శాఖకు గౌరవం తీసుకొచ్చిన అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డికి జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ గారు మరోసారి అభినందనలు తెలిపారు.