🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 16 October 2026, 7:33 pm Posted by : Telangana Vaartha

ఆర్టిఐ కార్యకర్తలు ప్రజలకు విస్తృత సేవలు అందించారు

News Image
ఘనంగా సమాచార హక్కు రక్షణ చట్టం 2005 10వ,ఆవిర్భావ దినోత్సవo
పది సంవత్సరాల కాలాలలో ఎన్నో విజయాలు
ఆర్టిఐ కార్యకర్తలు ప్రజలకు విస్తృత సేవలు అందించారు.
కోదాడ:- పట్టణంలో ఎమ్మెస్ జూనియర్ కాలేజీలో సూర్యాపేట జిల్లా గౌరవ అధ్యక్షులు బత్తిని నాగేశ్వరరావు నియోజకవర్గ అధ్యక్షులు గడ్డం అధ్యక్షతన సమాచార హక్క రక్షణ చట్టం 2005 పదో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ పది సంవత్సరాల కాలంలో ఆర్టిఐ కార్యకర్తలు ప్రజలకు ప్రభుత్వ అధికారుల మధ్య వారధిగా పనిచేయటం చాలా అభినందనీయం. ప్రజలకు కావలసిన అనేక సమస్యలను పరిష్కరించడంలో ముందంజలో ఉన్నారు. అవినీతి రహిత సమాజం కోసం కృషి చేయడం జరిగింది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు ప్రభుత్వ అధికారుల ద్వారా అందించడంలో కీలకమైన పాత్ర పోషించారు. ప్రభుత్వ కార్యాలయాలలో ఆర్టిఐ బోర్డులను ఏర్పాటు చేయించడంలోనూ, చట్టాలపై అవగాహన కల్పించడంలో ఈ సంఘం ఎంతో ముందంజలో ఉంది. సమాచార హక్కు చట్టం యొక్క విధి విధానాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లడంలో కార్యకర్తల కృషి ఎంతో ఉన్నది. గ్రామస్థాయిలో కూడా సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన సరస్సులు నిర్వహించడం జరిగింది. అనేక సామాజిక సేవా కార్యక్రమాలలోని ఆర్టిఐ సొసైటీ చాలామందిలో ఉన్నది. సమావేశం అనంతరం సమాచార హక్కు రక్షణ చట్టం 2005 యొక్క కేకు కటింగ్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాంపాటి సందీప్,గెల్లా పవన్, వీరబాబు మరియు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home