🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 16 October 2026, 6:48 pm Posted by : Telangana Vaartha

తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

News Image
ఖమ్మం ఖమ్మం జడ్పీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ పిడమర్తి రవి అన్న పిలుపుమేరకు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారును గుర్తించడానికి మరియు వాళ్ల పేర్లు నమోదు చేసుకోవడానికి వెబ్సైట్ ప్రక్రియను ప్రారంభించినందుకు ఉద్యమకారుల అందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వెబ్సైట్ ప్రక్రియను వేగవంతం చేసి తెలంగాణ ఉధ్యమ కారులను గుర్తించి 250 గజాల ఇంటి స్థలం, గుర్తింపు కార్డు, ఇంటి నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు, నేలకు 30 వేలు వేతనం ఇచ్చేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నాయకుడు మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు జిల్లా విజయ్ కుమార్, తెలంగాణ ఉద్యమ జేఏసీ రాష్ట్ర నాయకులు మట్టి గురుమూర్తి, డాక్టర్ కె.వి కృష్ణారావు, కొరకప్ప రామారావు, మహేష్, అరుణ, సరిత, సబిత, సురేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home