సూర్యాపేట రూరల్ మండలం బాలెంల స్టేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..
క్షతగాత్రులను సమీపంలోని ఏరియా హాస్పిటల్ కు తరలించిన స్థానికులు..
సూర్యాపేట రూరల్:- జనగాం నుండి సూర్యాపేట వైపు వస్తున్న డీసీఎం బాలెంల స్టేజ్ సమీపంలో జాగింగ్ చేస్తున్న గుర్రం సైదులు, ఆలకుంట్ల నాగరాజు, గొల్ల జానయ్య లను బలంగా డీకొట్టింది. ఈ సంఘటనలో గుర్రం సైదులు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు.. తీవ్రగాయాలై రెండుకాల్లు విరిగి తీవ్ర రక్త స్రావం అయిన ఆలకుంట్ల నాగరాజు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి.. గొల్ల జానయ్య తలకు బలమైన గాయాలు కావడంతో హైదరాబాద్ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం..