🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 16 October 2026, 3:21 am Posted by : Telangana Vaartha

ఆమెకు 30 ఏళ్లు. అతనికి 75ఏ‍ళ్లు. ఇద్దరూ ఏడాది క్రితం ప్రేమ త్వరలోనే పెళ్లి

News Image
ఆమెకు 30 ఏళ్లు. అతనికి 75 ఏ‍ళ్లు. ఇద్దరూ ఏడాది క్రితం ప్రేమలో పడ్డారు. ఈ దసరా నవరాత్రి ఉత్సవాల తరువాత ఇద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. అంతేకాదు వీరిద్దరూ ఘనంగా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. ఇరు కుటుంబాల ఆనందోత్సాహాల మధ్య జరిగిన ఈ నిశ్చితార్థం వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పెళ్లి కాని ప్రసాద్ ల గుండెల్లో గునపాలు దించుతున్న ఈ వీరి ప్రేమకథ వివరాలేంటో తెలుసుకుందామా. ఉత్తర ప్రదేశ్‌లోని ఔరైయా జిల్లాకు చెందిన 75 ఏళ్ల రామ్‌షుగర్ (Ramsugar),30 ఏళ్ల రాణి రాజ్‌పుత్ (Rani Rajput) త్వరలోనే పెళ్లి పీటలెక్క బోతున్నారు. దాదాపు 45 ఏళ్ల గ్యాప్‌ ఉన్నావీరి మధ్య చిగురించిన ప్రేమ, పెళ్లి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఏడాది క్రితం వీరి ప్రేమ ఎలా మొదలైందీ అంటే
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసే రాణి రాజ్‌పుత్, రామ్‌షుగర్ కుమార్తెను కలవడానికి తరచుగా ఆయన ఇంటికి వెళ్లేది. రామ్‌షుగర్ భార్య ఏడేళ్ల క్రితమే మరణించారు. ఆయన ఒంటరిగా ఉంటున్న సమయంలో రాణి రాజ్‌పుత్ ఆయనకు దగ్గరైంది. ఆ సమయంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం, స్నేహంగా మారి ఆ తర్వాత ప్రేమగా చిగురించింది. వీరిద్దరికీ నిశ్చితార్థం కాగా, నవరాత్రుల అనంతరం వివాహం జరగనుంది. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇందులో కుటుంబ సభ్యులు ఆప్తుల సమక్షంలో వీరిద్దరూ ఎంతో సంతోషంగా కనిపించారు.
నెటిజన్ల రియాక్షన్స్‌
వీరి నిశ్చితార్థానికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా హల్‌చల్ చేస్తున్నాయి. ఎక్స్‌లో వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు వీరికి శుభాకాంక్షలు తెలుపుతోంటే, "రామ్‌షుగర్ వెర్సస్‌ షుగర్ డాడీ " అంటూ సరదాగా కామెంట్లు చేశారు. మరికొందరు ప్రేమ గుడ్డిదని ఈ రోజు మరోసారి రుజువైంది భయ్యా అంటూ ఫన్నీ కామెంట్స్‌ చేశారు. అంతేకాదు, "యువత పరిస్థితి ఏంటి భయ్యా?" అని ఒకరు, అసలే యువకులకు పెళ్లిళ్లు కావడం లేదని బాధపడుతోంటే, ఇక మాలాంటి వాళ్ల పరిస్థితేంటి బాబోయ్‌ అని మరొక నెటిజన్ కామెంట్ చేశారు. కొంతమంది "ప్రేమకు వయసుతో సంబంధం లేదు" అని అంటుంటే, మరికొందరు మాత్రం ఇది కేవలం ఫాలోవర్స్ మరియు వ్యూస్ కోసం చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ (నాటకం) అని, లేదా ఆస్తి కోసమేనని కామెంట్స్ చేస్తూ మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారు. ‘‘ఇంతకీ ఆ 70 ఏళ్ల పెద్దాయన పేరిట ఉన్న ఆస్తి విలువ ఎంత ఉందో?" అంటూ ఇంకొకరు చమత్కరించారు. వీరిద్దరి మధ్య ఉన్న భారీ వయస్సు వ్యత్యాసం కారణంగా ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
🏠 Home