🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 16 October 2026, 12:51 am Posted by : Telangana Vaartha

పోలీసుల అదుపులో లేడీ డాన్ కోనేటి సులోచన

News Image
ముఖ్యమైన పాయింట్స్:భూ కబ్జాలు, అమాయకులను మోసం చేయడం
Madanapalli:- అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలో కలకలం సృష్టించిన లేడీ డాన్ కోనేటి సులోచనను పోలీసులు ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని మదనపల్లె పట్టణంలోని నీరుగట్టుపల్లికి చెందిన సులోచనపై మొత్తం 14 కేసులు ఉన్నట్లు సమాచారం. పలు పోలీస్ స్టేషన్లలో రౌడీ షీట్ ఉంది. భూ కబ్జాలకు పాల్పడటమే కాకుండా, అమాయకులను మోసం చేయడం.. భూముల వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడటం వంటి ఆరోపణలతో పాటు హత్యాయత్నానికి సంబంధించిన కేసులు కూడా ఆమెపై నమోదైనట్లు తెలుస్తోంది. మదనపల్లె వన్‌టౌన్‌, టూటౌన్‌, తాలూకా పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఆమె పలువురిని ఇబ్బంది పెడుతున్నట్లుగా పలు నేరారోపణల నేపథ్యంలో సులోచనను అదుపులోకి తీసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మొత్తం 14 కేసులు నమోదు..
సులోచనపై మదనపల్లె 1-టౌన్, 2-టౌన్, తాలూకా తదితర పోలీస్ స్టేషన్లలో దాదాపు 14 వరకు చీటింగ్ కేసులు నమోదై ఉన్నాయి. కేవలం మోసాలే కాకుండా భూ కబ్జాలు, హత్యా యత్నం వంటి తీవ్రమైన అభియోగాలు కూడా ఆమెపై ఉన్నాయి. ఈ కేసులను తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ ధీరజ్, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, డీఎస్పీ ప్రసాద్ ఆదేశాల మేరకు వన్లైన్ పోలీసులు ఇవాళ ఉదయం సులోచనను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. సులోచనపై నమోదైన కేసులు, భూ ఆక్రమణలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదుల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెను అదుపులోకి తీసుకున్న అనంతరం విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. వివిధ పోలీస్‌ స్టేషన్లలో నమోదైన కేసుల నేపథ్యంలో ఆమెపై ఉన్న ఆరోపణలకు సంబంధించిన వివరాలను సేకరించే అవకాశం ఉంది. ఈ విచారణలో మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయా, ఇప్పటికే నమోదైన కేసుల్లో తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
🏠 Home