🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 16 October 2026, 12:22 am Posted by : Telangana Vaartha

తిరుమలలో స్వల్పంగా పెరిగిన భక్తుల రద్దీ

News Image
సర్వదర్శనానికి 27 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు
టోకెన్లు లేనివారికి దర్శనానికి 8 గంటల సమయం
బుధవారం శ్రీవారిని దర్శించుకున్న 84 వేల మందికి పైగా భక్తులు
నిన్న ఒక్కరోజే రూ.3.33 కోట్లుగా నమోదైన హుండీ ఆదాయం
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. గురువారం ఉదయం నాటికి, సర్వదర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 27 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. టైమ్‌స్లాట్ టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనం లభించడానికి సుమారు 8 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా అన్నప్రసాదం, పాలు, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా, లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాల వద్ద తోపులాటలు జరగకుండా భద్రతా సిబ్బందిని నియమించి, రద్దీని క్రమబద్ధీకరిస్తున్నారు. మరోవైపు, బుధవారం రోజున మొత్తం 84,289 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 31,474 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ద్వారా స్వామివారికి రూ.3.33 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
🏠 Home