ఖమ్మం:- నగరంలోని 25వ డివిజన్ రిక్కా బజార్ అమ్మ భవాని ఆలయం వద్ద మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 25వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గోళ్ళ చంద్రకళ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులు తో కలిసి భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదానం అన్ని దానాల్లోకెల్లా గొప్పదని పేర్కొన్నారు. ఆకలితో ఉన్నవారికి కడుపునిండా భోజనం పెట్టడం ఎంతో సంతృప్తినిస్తుందని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. భక్తులు తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించి ఆమె కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమ్మ భవాని గుడి చైర్మన్ గుజ్జరి శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ రాకుండు కృష్ణ, గౌరవ అధ్యక్షులు తిరుపతిరావు, శ్రీధర్, గుజ్జరి నాగేశ్వరావు మరియు మహిళా మండలి భక్తులు పాల్గొన్నారు.