🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 15 October 2026, 10:25 pm Posted by : Telangana Vaartha

రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

News Image
నేరేడుచర్ల అక్టోబర్ 15:- రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు అన్నారు, గురువారం నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని స్పందన, వైస్ చైర్మన్ మునగాల భాస్కర్ రెడ్డి తో పాటు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేసి, పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో మున్సిపల్ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొణతం చిన్న వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులను వరదలగా తీసుకొస్తున్న విషయాన్ని గుర్తు చేశారు, అన్ని వర్గాలను కలుపుకొని సమన్వయంతో రాజకీయం చేసినప్పుడే గుర్తింపు లభిస్తుందని అన్నారు, సుదీర్ఘ కాలంగా రాజకీయాలు కొనసాగిస్తున్న వారికి పదవులు లభిస్తాయి అన్నారు. పార్టీ అభివృద్ధికి పని చేస్తున్న వారికి తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందని తెలిపారు, గోదాముల నిర్మాణం చేపట్టి రైతుల అవసరాలను తీర్చాలని అన్నారు, ప్రభుత్వం ఇటీవలనే మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులకు 260 కోట్ల రూపాయలు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు, నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన రంగినేని స్పందన రాజీవ్ మాట్లాడుతూ తాను విదేశాలలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నప్పటికీ రైతులకు, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాలలో ప్రవేశించానన్నారు, రైతులకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి, మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు, నూతన పాలకవర్గ నియామకానికి సహకరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, నేరేడుచర్ల, పాలకవీడు మండలాల ప్రజా ప్రతినిధులకు, మాజీ ప్రజా ప్రతినిధులకు, నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. డైరెక్టర్లుగా కర్ణం రామ నరసయ్య, బుర్రి వెంకయ్య, సూరోజు రవీంద్ర చారి, ఊటుకూరు సైదులు, పల్లె కాశయ్య, కత్తి శ్రీనివాసరెడ్డి, ధనావత్ సైదులు, రమావత్ వశ్య నాయక్, చింతలచెరువు ప్రియాంక, పోతురాజు జ్యోతి ,రెబ్బ రమేష్, పోలా విశ్వనాథం మున్సిపాలిటీ చైర్మన్ మున్సిపాలిటీ నేరేడుచర్ల కొనతం వెంకట్ రెడ్డిలు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు, మొదట స్థానిక ప్రధాన కూడలి నుండి మార్కెట్ కమిటీ కార్యాలయం వరకు చైర్మన్ రంగనేని స్పందన రాజీవ్ లతోపాటు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం చైర్మన్ దంపతులకు గజమాల వేశారు ,హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ హుజూర్నగర్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, నేరేడుచర్ల హుజూర్నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి, కోతి సంపత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు సాముల శివారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, అరుణ్ కుమార్ దేశముఖ్, పాలకవీడు మాజీ ఎంపీపీ భూక్య గోపాల్, మాజీ జెడ్పిటిసి మాలోత్ మోతిలాల్ నాయక్, బెల్లంకొండ నరసింహారావు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ నేరేడుచర్ల వైస్ చైర్మన్ తాళ్ల సురేష్ రెడ్డి, మాజీ సహకార సంఘం చైర్మన్ చలసాని శ్రీనివాస్, కౌన్సిలర్లు కొణతం మంజుల, లక్ష్మి శ్రీనివాస్, ఇంజమూరి శ్రీకాంత్, నన్నెపంగా శ్రీను, కొ ఆప్షన్ సభ్యులు శ్రవణ్ రెడ్డి, షేక్ మొగలాబి, మాజీ మున్సిపల్ చైర్మన్ నేరేడుచర్ల బచ్చలకూరి ప్రకాష్, నేరేడుచర్ల, పాలక వీడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుబ్బారావు, పాలక వీడు సర్పంచుల ఫోరం అధ్యక్షులు రహీముద్దీన్, నీమ, గరిడేపల్లి మాజీ ఎంపీపీ గరిడేపల్లి పెండెమ్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీవర్కింగ్ ప్రెసిడెంట్ కట్ట రామారావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వల్లంశట్ల రమేష్ బాబు, సర్పంచులు పారేపల్లి సత్యనారాయణ, చిన్న వెంకన్న, వల్లంశట్ల, వల్లంశెట్ల లచ్చయ్య, రాచకొండ అజయ్ కుమార్, రణపంగ నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home