🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 15 October 2026, 10:18 pm Posted by : Telangana Vaartha

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు సహాయ కేంద్రం ప్రారంభం

News Image
సూర్యాపేట పట్టణంలోని 48వ వార్డులో సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, 48వ వార్డు కౌన్సిలర్ వెలుగు వెంకన్నఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఖమ్మం – వరంగల్ – నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు సహాయ కేంద్రాన్ని ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సూర్యాపేట మున్సిపల్ చైర్‌ పర్సన్ మాశెట్టి నివేదిత. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి పట్టభద్రుడు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవడం బాధ్యతగా భావించాలని సూచించారు. ఓటర్ల నమోదు ప్రక్రియపై పట్టభద్రులకు అవగాహన కల్పించడంతో పాటు, నమోదు సమయంలో అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఇలాంటి సహాయ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఓటును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉమ్మడి ఖమ్మం – వరంగల్ – నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పట్టభద్రులంతా ఐక్యంగా ముందుకు వచ్చి ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, జిల్లా కాంగ్రెస్ పార్టి ఉపాద్యక్షులు ముదిరెడ్డి రమణారెడ్డి, వార్డు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home