🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 15 October 2026, 10:16 pm Posted by : Telangana Vaartha

JBM బస్సు డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి

News Image
సూర్యాపేట:- JBM బస్సు డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీసీ ఉద్యమ నేత వట్టే జానయ్య యాదవ్ కోరారు. డ్రైవర్లకు రావాల్సిన జీతాలు సక్రమంగా అందక వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. డ్రైవర్లకు సంబంధించిన PF, ESI నిధుల వివరాలపై స్పష్టత ఇవ్వడంతో పాటు, వారికి రావాల్సిన ప్రయోజనాలను సకాలంలో అందించాలని యాజమాన్యాన్ని కోరారు. అలాగే డ్రైవర్లు ఎదుర్కొంటున్నహెల్త్ కార్డుల సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని సూచించారు. డ్రైవర్లపై పని ఒత్తిడిని తగ్గించి, వారి సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని వట్టే జానయ్య యాదవ్ కోరారు. డ్రైవర్ల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మీర్ అక్బర్, వల్లల సైదులు యాదవ్, చాంప్ల నాయక్, వట్టే లింగరాజు యాదవ్, ఉప్పునుతల కోటేశ్, రఘు, మహేష్, సాయి, అనిల్ తదితరులు పాల్గొన్నారు
🏠 Home