తుంగతుర్తి నియోజకవర్గం ప్రజలు సుఖశాంతులతో ఉండాలి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తిరుమలగిరి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు & మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గమాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు ప్రసాదాలు అందజేసిన డా.గాదరి కిశోర్ కుమార్
తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కరువు, కాటకాలు రాకుండా, పంటలు సమృద్ధిగా పండి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని దుర్గామాత అమ్మవారిని ప్రార్థించారు. ప్రతి ఒక్కరిపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నేవూరి ధర్మేందర్ రెడ్డి, మదర్ డైరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మి నర్సింహ రెడ్డి, మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఏమోజు గోవిందమ్మ రవీందర్, మండల పార్టీ అధ్యక్షులు కల్లెట్లపెళ్లి ఉప్పలయ్య, రమేష్, మాజీ మార్కెట్ చైర్మన్లు యాకూబ్ రెడ్డి, మహేందర్ మరియు స్థానిక కౌన్సిలర్ల, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్షులు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు