🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 15 October 2026, 11:01 am Posted by : A2TV NEWS

బతుకమ్మ ఆటపాట కార్యక్రమం

News Image
ముఖ్యమైన పాయింట్స్:భువనగిరిలో ఘనంగా ఎన్‌పీఆర్‌డీ మహిళా విభాగం ఆధ్వర్యంలో
భువనగిరి 15 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ)యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని సుందరయ్య భవనంలో బతుకమ్మ ఆటపాట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్,జిల్లా మహిళా విభాగం కన్వీనర్ కొత్త లలిత మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానంలో ప్రత్యేక స్థానం కలిగి ఉందని పేర్కొన్నారు. వికలాంగ మహిళలు సైతం అన్ని రంగాల్లో ముందుకు సాగాలని, తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వికలాంగ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, వారికి సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. బతుకమ్మ ఆటపాట కార్యక్రమం ద్వారా మహిళల్లో ఉత్సాహాన్ని, ఐక్యతా భావాన్ని పెంపొందించడమే లక్ష్యమని వారు తెలిపారు. మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మహిళా విభాగం జిల్లా నాయకురాలు మంజుల ఇందు రాణి ప్రశాంతి నరసమ్మ నాగమణి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home