🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 15 October 2026, 12:36 am Posted by : Telangana Vaartha

గంజాయి, డ్రగ్స్ నిర్మూలపై బుర్రకథ కళా ప్రదర్శన

News Image
సూర్యాపేట: గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని అలవర్చుకోవాలని సామాజిక కార్యకర్త తెలుగు ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ సూచించారు.సూర్యా పేట జిల్లా మద్దిరాల మండలం గోరంట్ల గ్రామంలో బుధవారం ప్రభాకర్ ఆధ్వర్యంలో బుర్రకథ కళా రూపంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా. గంజాయి డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే శారీరక, ఆర్థిక సామాజిక మానసిక నష్టాలను వివరించారు ద్విచక్ర వాహనాలను నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. అదేవిధంగా కారు నడిపేవారు విధిగా సీటు బెల్టు ధరించాలని రహదారి నిబంధనలను పాటించాలని తెలిపారు. గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సమాజంలో వాటి నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించి క్షేమంగా గమ్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గోరంట్ల ప్రజలకు గంజాయి, డ్రగ్స్ కు సంబంధించిన అవగాహన కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కథకుడు గా రాచకొండ ప్రభాకర్, వంతలుగా నారాయణ, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home