🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 14 October 2026, 11:05 pm Posted by : Telangana Vaartha

చింతలచెరువు కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్.

News Image
80 మంది పోలీసు సిబ్బందితో ప్రతి ఇల్లు తనిఖీ.. 52 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, ఒక కారు గుర్తింపు.
.... పౌరులు ప్రశాంత వాతావరణంలో జీవనం కొనసాగించడమే పోలీస్ లక్ష్యం......
- అత్యాశకు పోయి ఎక్కువ లాభాలు వస్తాయని ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టవద్దు.
- యువత బెట్టింగ్ యాప్ లకు దూరంగా ఉండాలి.
- లోన్ యాపుల నుండి లోన్స్ తీసుకోవద్దు.
.... సూర్యాపేట డివిజన్ డిఎస్పి ప్రసన్నకుమార్.
ప్రజలకు భద్రత, రక్షణ కల్పించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, అనుమానిత వ్యక్తుల కదలికలను అరికట్టడం లక్ష్యంతో సూర్యాపేట పట్టణంలోని చింతలచెరువు కాలనీలో సూర్యాపేట పట్టణ పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో సూర్యాపేట పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, సూర్యాపేట రూరల్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్, పట్టణ, రూరల్, చివ్వెంల, పెనపహడ్ ఎస్ఐ లతో పాటు మొత్తం 80 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఆపరేషన్‌లో సరైన అనుమతి పత్రాలు లేని, సరైన నంబర్ ప్లేట్లు లేని 52 వాహనాలను, 5 ఆటోలను, ఒక కారును పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎస్పి నరసింహ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. వీటి ద్వారా ప్రజల్లో భద్రతాభావం పెరగడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొన్నారు. కాలనీల్లో దొంగతనాలను నివారించేందుకు ప్రజలు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సరైన గుర్తింపు లేని కొత్త వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దు, అనుమానాస్పద వ్యక్తులు లేదా వారి కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, కాలనీల్లోకి గంజాయి, ఇతర మత్తు పదార్థాలు ప్రవేశించకుండా అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని డీఎస్పీ సూచించారు. ప్రయాణ సమయంలో ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ ధరించాలని పెద్దవాహనలో ప్రయాణించి వారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని తెలిపారు ముందస్తు జాగ్రత్తలతోనే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చునని తెలిపారు. అలాగే అపరిచిత వ్యక్తులు ఫోన్కు మెసేజ్లు పంపించిన ఫోన్ కాల్ చేసిన వ్యక్తిగత వివరాలను తెలుపవద్దని బ్యాంకు వివరాలు ఓటిపి ఏటీఎం పిన్ వివరాల లాంటివి ఇవ్వవద్దని అన్నారు ఆన్లైన్లో ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయంటే నమ్మవద్దని పెట్టుబడులు పెట్టవద్దని సూచించారు ఇలాంటి వాటి వెనుక సైబర్ నేరగాళ్లు ఉంటారని ఆర్థిక నష్టం కలిగిస్తారని ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. నేర ప్రవృత్తిని విడనాడి ప్రశాంత జీవనం సాగించాలి.. నేరానికి పాల్పడితే చట్టానికి చిక్కక తప్పదు అన్నారు. పౌరులందరూ ప్రశాంత వాతావరణంలో జీవనం కొనసాగించాలని, నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు తమ ప్రవర్తనను మార్చుకొని సత్ప్రవర్తనతో మెలగాలని డీఎస్పీ సూచించారు. చట్టాలను మరింత పటిష్ఠంగా అమలు చేస్తూ నేరాలకు పాల్పడే వారిపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎవరైనా నేరాలకు పాల్పడితే ఏదో ఒక రోజు చట్టానికి చిక్కక తప్పదని, నేరస్తులకు శిక్షలు పడేలా పటిష్ఠమైన ఆధారాలతో కేసులను దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆవేశంతోను వ్యక్తిగత కక్షలతోనూ దాడులు చేసుకుంటే కేసుల్లో చిక్కుకొక తప్పదని తెలిపారు. గొడవలు పెట్టుకోకుండా కాలనీవాసులంతా ఐక్యమత్యంతో ఉండాలని సూచించారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ ప్రాధాన్యత. నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలి.
🏠 Home