🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 14 October 2026, 10:54 pm Posted by : Telangana Vaartha

ఐటిఐ కాలేజీకి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మందుల సామేల్

News Image
అడ్డగూడూరు 14 అక్టోబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో ప్రభుత్వ ఐటీఐ కాలేజీకి భూమి పూజ చేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మండలంలోని వివిధ గ్రామాలలో గుడిసెల్లో నివాసం ఉంటున్న 31 మంది ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారులకు మంజూరు కాబడిన ఉత్తర్వులను పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విమల,వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి ఎంపీడీవో శంకరయ్య,తాసిల్దార్ శేషగిరిరావు హౌసింగ్ డిఈ ,ఏఈ గోపిసింగ్ పాల్గొన్నారు. గుడిసెలు ఉన్నవారికి అడ్డగూడూరు 1, ఆజింపేట2, రేపాక1, చౌళ్ళరామారం22, జానకిపురం 2, లక్ష్మీదేవికాల్వ 2, కోటమర్తి 2, ఇళ్లకు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర నాయకులు, మోత్కూర్ మార్కెట్ డైరెక్టర్లు, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు సోమనారాయణ, వివిధ గ్రామాల సర్పంచులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home