🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 14 October 2026, 9:43 pm Posted by : జేరిపోతుల రాంకుమార్

చిన్న పిల్లలకు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

News Image
తిరుమలగిరి 15 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- పిల్లలకు సమయానికి రోగ నిరోధక టీకాలు వేయించాలి. దానికో క్రమ పద్ధతి ఉంటుంది. నిర్దిష్ట సమయంలో నిర్ణీత వ్యాక్సినేషన్ వేయించాలని సి హెచ్ ఓ చంద్రశేఖర్ అన్నారు తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో వారు ఆకస్మిక తనిఖీ నిర్వహించి బాలింతలకు గర్భిణీలకు అవగాహన కల్పించారు ఈ వ్యాక్సీన్ల వల్ల ప్రాణాంతకమైన 20 రకాల వ్యాధుల బారిన పడకుండా పిల్లల్ని కాపాడుకోవచ్చు.పిల్లలకు పుట్టిన వెంటనే నేషనల్ ఇమ్యూనైజేషన్ షెడ్యూల్ ప్రకారం వ్యాక్సినేషన్లు ఇవ్వడం వల్ల డిఫ్తీరియా, పెర్ట్యూసిస్, టెటనస్, పోలియో, మీజిల్స్, బీసీజీ, టీబీ,హెపిటైటిస్-బి, హిమోఫిలస్ ఇన్‌ఫ్లూయెంజా టైప్ బి, డయేరియా, మంప్స్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ మణికంఠ, సూపర్వైజర్ స్వరూప రాణి, ఏఎన్ఎం వెంకటమ్మ, ఆశ వర్కర్స్ శోభ, పూలమ్మ, గర్భిణీలు బాలింతలు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home