🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 14 October 2026, 9:37 pm Posted by : జేరిపోతుల రాంకుమార్

ప్రశాంతత వాతావరణంలో దసరా ఉత్సవాలు జరపాలి

News Image
తిరుమలగిరి 15 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో గ్రామ సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, తిరుమలగిరి ఎస్‌ఐ గుత్త వెంకట్ రెడ్డి పాల్గొని గ్రామ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో బెల్ట్ షాపులు మూసివేయాలని, అక్రమంగా మద్యం విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. రాబోయే దసరా పండుగను గ్రామ ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో, సోదరభావంతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.
🏠 Home