🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 13 October 2026, 9:46 pm Posted by : జేరిపోతుల రాంకుమార్

కాంగ్రెస్ పార్టీతోనే తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధి సాధ్యం

News Image
తిరుమలగిరి 14 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకరి జనార్దన్ అధ్యక్షతన పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది. గత మూడు సంవత్సరాల నుండి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా అనేక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని సాగునీరు, త్రాగునీరు విద్య, వైద్యం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నారని తుంగతుర్తి నియోజకవర్గం ఏర్పడిన కానుండి ఏ నాయకుడికి రానంత మెజారిటీ తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు 52,000 మెజారిటీని తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు అందించారని, నిత్యం నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సఖ్యత ప్రోత్సాహంతో శాసనసభ్యులు నియోజకవర్గ అభివృద్ధికి కావలసిన నిధులను మంజూరు చేయిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ పానుగంటి నరసింహారెడ్డి, నాగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కన్నబోయిన వెంకట బిక్షం, తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జుమ్మిలాల్, తిరుమలగిరి PACS చైర్మన్ పాలెపు చంద్రశేఖర్, తిరుమలగిరి మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ తిరుమణి యాదగిరి, 7వ వార్డు కౌన్సిలర్ బత్తుల శ్రీనివాస్, 9వ వార్డు కౌన్సిలర్ కన్నెబోయిన మల్లయ్య, జలాల్ పురం సర్పంచ్ బెట్టెం రాజు, నియోజకవర్గ ప్రెస్ కన్వీనర్ కందుకూరి లక్ష్మయ్య, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పేరాల నరేష్, మాజీ కౌన్సిలర్ గుగులోతు భాస్కర్, తాటిపాముల గ్రామ శాఖ అధ్యక్షులు నాయిని కృష్ణ, తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొంపెల్లి సాయి, తిరుమలగిరి కాంగ్రెస్ మండల నాయకులు గుగులోతు హీరు నాయక్, మాసoపల్లి మోహన్, రమేష్. కొండయ్య, బిక్షం నాయక్, తదితరులు పాల్గొనడం జరిగింది...
🏠 Home