🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 13 October 2026, 7:15 pm Posted by : Telangana Vaartha

గిరిజనుల హక్కుల సాధన ఆధార్ పార్టీతోనే సాధ్యం

News Image
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ నిధులు పూర్తిగా వారికే ఖర్చు చేయాలి
రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం
ఆధార్ పార్టీ పినపాక నియోజకవర్గ సమావేశంలో డా. ఈడా శేషగిరిరావు
ఉప్పెన / పినపాక: గిరిజనుల హక్కుల సాధన ఆధార్ పార్టీతోనే సాధ్యమని, గిరిజనులకు అండగా ఆధార్ పార్టీ ఉంటుందని, ఆధార్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా .ఈడా శేషగిరిరావు అన్నారు. మంగళవారం మణుగూరు మండల కేంద్రంలో పినపాక నియోజకవర్గ ఆధార్ పార్టీ కార్యకర్తల సమావేశం కల్తీ రమేష్ అధ్యక్షత జరిగింది. ఈ సమావేశంలో డా.శేషగిరిరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీటికి సరైన ప్రత్యామ్నాయం ఆధార్ పార్టీయేనని ఆయన అన్నారు.ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని శేషగిరిరావు అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ తదితర అట్టడుగు, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కేటాయించే బడ్జెట్ నిధులు పూర్తిస్థాయిలో ఆయా వర్గాల సంక్షేమానికే వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోని వాటి పరిష్కారం కోసం నిరంతరం ప్రజల పక్షాన నిలబడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బలమైన శక్తి గా ఆధార్ పార్టీని తీర్చిదిద్దేందుకు అందరి సహకారంతో ముందుకు సాగుతామని తెలిపారు. అట్టడుగు వర్గాల హక్కులు, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం కోసం పార్టీ కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. 2028జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో ఆధార్ పార్టీ పోటీ చేస్తుందని ఆయన అన్నారు. త్వరలో జరగబోయే పట్టభద్రల ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.ఆధార్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబోజి బుడయ్య,రాష్ట్ర ST సెల్ అధ్యక్షులు అల్లెం వెంకటేశ్వర్లు, రాష్ట్ర sc సెల్ అధ్యక్షులు బండ రాజారామ్, రాష్ట్ర చేరికల కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ తోడేటి దుర్గాప్రసాద్ గౌడ్, కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కంటే కేశవ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు ముత్తయ్య దొర,సెక్రటరీ నరేష్, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ కల్లూరి రాణి,కొత్తగూడెం ఇంచార్జి ప్రేమ్ దయాళ్, ఇల్లందు ఇంచార్జీ అల్లెం రామ,ఖమ్మం జిల్లా అధ్యక్షులు కుక్కల నాగేశ్వరరావు, ఆదార్ పార్టీ నాయకులు తల్లాడ వెంకన్న, అంబోజు రవి, కొప్పుల సునీల్, ఈడ శ్రీనివాస్, బొంగోని గణేష్, జనగాం సరిత, వెంకట కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.
🏠 Home