భావనా డయాబెస్ట్ రైస్ షోరూం ప్రారంభం
సూర్యాపేట పూల సెంటర్ యందు భావనా డయాబెస్ట్ రైస్ నూతన షోరూం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. భావనా డయాబెస్ట్ రైస్ అధినేత రాచర్ల చిరంజీవి ఆహ్వానం మేరకు DCC ట్రెజరర్ కక్కిరేణి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై షోరూంను ప్రారంభించి, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే డయాబెస్ట్ రైస్ ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని, వ్యాపారరంగంలో రాచర్ల చిరంజీవి మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.