జోగులాంబ గద్వాల 13 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. వడ్డేపల్లి మండలం& మున్సిపాలిటీ. శాంతినగర్ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నవరాత్రుల్లో భాగంగా మూడవరోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించడం జరిగినది. అమ్మవారిని అలంకరించినటువంటి అయ్య నవీన్ స్వామి మరియు లక్ష్మణస్వామి ప్రాతఃకాలం నుంచి అమ్మవారికి అభిషేకాలు హోమాలు మరియు ఉదయము కుంకుమార్చన కార్యక్రమము సాయంత్రము బియ్యంతో అర్చన పల్లకి సేవ లు జరిగాయి. పూజా తదనంతరము మహా మంగళహారతి జరిగాయి. అలాగే పూజానంతరం వచ్చినటువంటి భక్తులకు ఆర్యవైశ్య సంఘం వాళ్లు ప్రసాద వితరణలు కూడా ఏర్పాటు చేశారు. పై కార్యక్రమాలు అన్నిటిలో కూడా మహిళలు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. పై కార్యక్రమాలు అన్నీ కూడా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రావూరి సురేష్ కుమార్ చేతుల మీదుగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.