🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 13 October 2026, 12:36 pm Posted by : జేరిపోతుల రాంకుమార్

సాండ్ టాక్సీ ఇసుక రవాణా నిలిపి వెయ్యొద్దు

News Image
తిరుమలగిరి 13 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- ఇసుక రవాణాపై 100 నుండి 130 కుటుంబాలు రోజువారి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబ భారాన్ని మోస్తున్న అంటూ అనంతరం నందపురం తాటిపాముల గ్రామాలకు చెందిన ట్రాక్టర్ యాజమాన్యం జిల్లా అధికారులకు విన్నపం చేశారు వివరాలకు వెళితే సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మరియు మున్సిపాలిటీ క్రింద అనంతరం నందాపురం తాటిపాముల ఉన్న గ్రామాల ఉన్న ట్రాక్టర్ యాజమాన్య కుటుంబాలు ఇసుక రవాణా మీద ఆధారపడి కుటుంబాన్ని నెట్టుకొస్తుండేది అయితే ఇటీవలే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాండ్ టాక్స్ యాప్ ద్వారా మాత్రమే గృహ నిర్మాణ కొరకు ఇసుక రవాణా చెయ్యాలి అక్రమంగా ఇసుక రవాణా చేస్తే ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీంతో ట్రాక్టర్లు యజమాన్యం సాండ్ టాక్స్ ద్వారా ఇసుక రవాణా చేసేది కానీ కొంతమంది గ్రామస్తులు ఈనెల 5వ తారీఖున సోమవారం ప్రజావాణి ఉండడంతో జిల్లా కలెక్టర్ కు ఇసుక రవాణా నిలిపివేయాలి ఎల్ నీలో ప్రభావం ఉండటం ద్వారా రైతులకు పశువులకు నీరు అందక తీవ్ర ఇబ్బందులు అందుకోవాల్సి వస్తుంది తద్వారా ఇసుక రవాణా నిలిపివేయాలని దరఖాస్తు చేశారు ఇట్టి దరఖాస్తుపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మైనింగ్ అధికారులు స్థానిక తహసిల్దార్ ఆర్ ఐ సాండ్ టాక్స్ ఇసుక తవ్వకాల ప్రదేశానికి చేరుకొని పరిశీలించారు ఇట్టి పరిశీలన జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పిస్తామన్నారు ఇదిలా ఉండగా అక్కడికి చేరుకున్న మైనింగ్ అధికారుల కు చుక్కేదిరింది ట్రాక్టర్ యజమాన్యం వారు అధికారులకు సాండ్ టాక్స్ ద్వారా దాదాపు 100 నుండి 130 కుటుంబాలు జీవనోపాధి కల్పన ఉన్నది కావున ఇట్టి జీవనోపాధిని కల్పించాలని మా నిరుపేద కుటుంబాలకు ఆసరాగా ఉండాలని వారికి వివరించారు అధికారులు ఏ విధంగా స్పందిస్తారో ఆ కుటుంబాలకు అండగా ఉంటారా లేదా అనేది ప్రశ్నోత్తరంగా మిగిలింది
🏠 Home