🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 13 October 2026, 4:48 am Posted by : Telangana Vaartha

ఘనంగా ముద్ద పప్పు బతుకమ్మ వేడుకలు

News Image
Khammam:- ఖమ్మం 56వ డివిజన్ విజయనగర్ కాలనీ శ్రీ షిరిడి సాయి బాబా మందిర ప్రాంగణంలో ముద్ద పప్పు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు . మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో తెలంగాణ సాంప్రదాయాలతో ఈ బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. స్థానిక మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా బతుకమ్మ ఆటలు, కోలాటాలు ఆడారు. అనంతరం ప్రసాద వితరణ, బతుకమ్మ నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు ప్రముఖులు పాల్గొన్నారు.
🏠 Home