విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తొలగించాలి
తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని 11 వ వార్డు అప్పారావు పంతులు ఇంటి వద్ద ఏర్పాటుచేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ నుతొలగించి వీధిలైటు వేయాలని కోరుతూ సోమవారం నాడు తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని ప్రజావాణిలో సీనియర్ జర్నలిస్ట్ బి వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు, 11వ వార్డులో ఏర్పాటుచేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ మూలంగా వీధిలైటు వేయకపోవడంతో వచ్చిపోయే వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయని ఆయన అన్నారు ప్రజాభిప్రాయం సేకరించకుండా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు అలాగే ప్రతినిత్యం ఈ వీధి గుండా తాటిపాముల నందా పురం, వస్తా కొండూరు తదితర ప్రాంతాలకు ప్రయాణికులు స్కూల్ విద్యార్థులను తీసుకువెళ్లే బస్సులు ఆటోలు వెళ్తుంటాయి ఈ మూల మీద రాత్రి వేళలో ప్రమాదాల జరిగే అవకాశం ఉన్నందున అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు