రేషన్ షాప్ లో 14 రకాల సరుకులు అందజేయాలి
తిరుమలగిరి ఎంపీడీవో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజావాణి లో
ప్రభుత్వ రేషన్ షాప్ ద్వారా అర్హులైన వారందరికీ 14 రకాల నిత్యావసర వస్తువులు అందించాలి
నిత్యవసర వస్తు ధరలు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోవడం వల్ల మధ్యతరగతి కుటుంబాలపై భారం పడతా ఉంది. పేదలు కిరాణం షాప్ కు వెళ్లి కనీస పోషక ఆహారం ఉప్పు పప్పులు కొనలేని పరిస్థితిఉనది పండుగల అదును చూసి కిరాణం షాప్ యజమానులు విచ్చలివిడిగా రేట్లు పెంచి పేదలపై భారం మోపుతున్నారు ప్రతి కిరాణం షాపుల్లో నాణ్యమైన సరుకులు లేకుండా జీరో వ్యాపారం చేస్తున్నారు
అందుకని ప్రభుత్వం ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి రేషన్ షాపుల ద్వారా చౌక ధరకు సరుకులు అందించాలని జి ఎం పి ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య ప్రభుత్వాన్ని కోరారు
14 రకాల సరుకులలో.
కందిపప్పు శనగపప్పు గోధుమలు గోధుమపిండి జొన్నలు రాగులు మంచి నూనె చింతపండు సబ్బులు సర్ఫ్ కుటుంబానికి సరిపోయే నిత్యవసర వస్తువులు ప్రభుత్వం సౌక ధరకు అందించాలి ప్రతి రేషన్ షాప్ లో 14 రకాల సరుకులు పేదలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
వాటితో పాటు నిత్యవసర వస్తు ధరలను అరికట్టడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలి
అదే విధంగా కిరాణం షాపుల్లో విచ్చలివిడిగా ధరలు పెంచి పేదలపై భారాన్ని మోపుతున్న కిరాణం షాప్ యజమానులపై అధికారులు తక్షణమే చర్య తీసుకుని ధరలను నియంత్రించాలని అధికారులను కోరారు
ఈ కార్యక్రమంలో పులిమామిడి భిక్షం పానుగంటి శీను మూల సత్తయ్య కడారి లింగయ్య మిట్టపల్లి లక్ష్మి యాకయ్య పాల్గొన్నారు