🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 12 October 2026, 8:25 pm Posted by : Telangana Vaartha

ఖమ్మం జిల్లా రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది

News Image
ప్రతి నియోజకవర్గంలో 20 వేల మంది పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలి: రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల శాసనమండలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ఖమ్మం జిల్లా సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందిస్తున్న భరోసాతోనే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఖమ్మం జిల్లాతో రాంరెడ్డి కుటుంబానికి ఎంతోకాలంగా అనుబంధం ఉందని, ఈ జిల్లా ప్రజల ఆదరాభిమానాలకు రుణం తీర్చుకునే అవకాశం తనకు లభించిందని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం పనిచేసిన దానికంటే మరింత ఉత్సాహంగా, సమన్వయంతో పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 20 వేల మంది పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని కోరారు.
ఖమ్మం జిల్లాలోని ప్రతి మండలంలో పర్యటించి, పట్టభద్రులను వ్యక్తిగతంగా కలిసి ఓటు అభ్యర్థిస్తానని తెలిపారు. తనకు ఆత్మీయ స్వాగతం పలికి, మద్దతుగా నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
🏠 Home