🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 12 October 2026, 8:16 pm Posted by : Telangana Vaartha

ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ

News Image
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి
_ బాసు హనుమంతు నాయుడు _
జోగులాంబ గద్వాల12 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. కేటి దొడ్డి మండలం యర్సన్ దొడ్డి గ్రామంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా బాసు హనుమంతు నాయుడు హాజరై, బతుకమ్మ వేడుకల్లో పాల్గొని,చిన్నారులు కోలాటంతో వేసిన నృత్యాన్ని వీక్షించారు... అంతకుముందు,బాసు హనుమంతు నాయుడు ని గ్రామ నాయకులు,మహిళలు డోలు మేళాలతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు....

అదే విధంగా,జోగులాంబ గద్వాల జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు....

- ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....

_ నియోజకవర్గ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు...._
ప్రపంచమంతా దేవుండ్లను పూలతో కొలిస్తే.. ఆ పూలనే దేవతగా కొలుస్తూ ప్రకృతిని ఆరాధించే అద్భుతమైన పండుగ మన బతుకమ్మ అని అన్నారు. దేశంలోని అన్ని సంప్రదాయ పండుగల్లో బతుకమ్మ ప్రత్యేకమని, తెలంగాణ జీవన విధానం, సంస్కృతికి దర్పణంగా నిలిచే బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల జీవితంలో భాగమైందన పేర్కొన్నారు. ఎంగిలిపూల బతుమ్మగా ప్రారంభమై, సద్దుల బతుకమ్మతో ముగిసే తొమ్మిది రోజుల పండుగ సందర్భంగా సందడి నెలకొంటుందని వెల్లడించారు. పిల్లాపాపలతో ఒకచోట కూడి, ఆటాపాటలతో, ఆడబిడ్డలు బతుకమ్మను కొలిచి మొకుతారని పేర్కొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మకు రాష్ట్ర పండుగ హోదానివ్వడమే కాకుండా, ఆడబిడ్డలకు కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేసే సంప్రదాయాన్ని అమలు చేశాడని గుర్తుచేశారు...ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వారి సంక్షేమానికి పలు రకాల పటిష్ట కార్యక్రమాలను నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిందని వివరించారు.... ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్,సురేష్,నరసింహులు, టీ.రవి,వెంకటేష్ నాయుడు, కృష్ణ యాదవ్,నరసింహులు,శేఖర్ నాయుడు,తిరుమలేష్,తిమ్మప్ప,సామెలు,రాముడు, మల్లికార్జున్, మహేందర్, నరేష్, హరికృష్ణ, వీరేష్, జంగిలప్ప, అంపన్న,లక్ష్మన్న, హనుమంతు ఆంజనేయులు, రవి, పరశురాముడు, రంగస్వామి, వీరేష్,మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.....
🏠 Home