జోగులాంబ గద్వాల 12 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి గద్వాల. పట్టణ కేంద్రం ఈ పట్టణ కేంద్రం నకు కూతవేటు దూరం లో ఉన్న గద్వాల మండలం వీరపురం గ్రామం నుండి కొందరు అక్రమంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా మట్టి తరలించడం జరుగుతుంది. సెలవు దినము అయినప్పటికీ వీరి అక్రమ మట్టి తరలింపుకు అడ్డు అదుపు లేకుండా పోతుంది, జూలై మాసం లో గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వన్ షేక్ బాషా, సంబంధిత రెవిన్యూ, మైనింగ్, పోలీస్ అధికారుల సమక్షంలో జిల్లా లో మట్టి. ఇసుక తరలింపు కోసం మైనింగ్, రెవిన్యూ అధికారుల నుండి అనుమతులు తీసుకొని మట్టి, ఇసుక తరలించడం చేయాలి అలా లేని పక్షంలో నిబంధనలు ఉల్లంగించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకొనబడును అని మీటింగ్ హల్ లో సమావేశపరిచి హెచ్చరికలు జరిచేయడం జరిగింది. కాని అ మాటలు. నిబంధనలు హెచ్చరిక లు కలెక్టర్ కార్యాలయం లో ఉన్న మీటింగ్ హల్ వరకే పరిమితం అవుతున్నాయి అని ఆరోపణలు వినబడుతున్నాయి. ప్రతి రోజు ఎదో విదంగా అక్రమంగా మట్టి తరలించడం జరుగుతుంది. ఏకంగా రూరల్ పోలీస్ స్టేషన్ ముందు మరియు కలెక్టర్ ఆఫీస్ ముందుగా నే వెళుతున్నాయి అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. రెవెన్యూ మరియు మైనింగ్ శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారా లేదు వేచి చూడాల్సిందే.