ప్రశాంత వాతావరణంలో దేవి నవరాత్రి ఉత్సవాలు జరపాలి ఎస్సై వెంకట్ రెడ్డి
దేవి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతత వాతావరణంలో నిర్వహించుకోవాలని తిరుమలగిరి ఎస్సై వెంకట్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీజేలకు ఎలాంటి అనుమతి లేదని, డీజేలు ఏర్పాటు చేయకూడదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దంతో సౌండ్ సిస్టమ్‌లు వినియోగించకూడదని, నిమజ్జన ఊరేగింపులను నిర్ణీత మార్గాల్లో నిర్వహిస్తూ, వదంతులను నమ్మకుండా పోలీసులకు సహకరించాలని అన్నారు. "దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలనీ సూచించారు. డీజే నిషేధ నిబంధనలను తప్పనిసరి పాటించాలనీ,భక్తులకు, ప్రజలకు , సూచించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.